rishi kapoor: నిన్న ఇర్ఫాన్.. నేడు రిషికపూర్.. హృదయం ద్రవించింది: రజనీ, చిరు, జూ.ఎన్టీఆర్

 We lost the supremely talented Irrfan Khan sir yesterday  And now Rishi Kapoor
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి 
  • రిషికపూర్ గొప్ప కళాకారుడు
  • భారతీయ సినిమాకు ఇది తీరని లోటు
అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే రిషికపూర్ మృతి చెందడం పట్ల సినీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

'హృదయం ద్రవించింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నా ప్రియ మిత్రుడు రిషికపూర్' అని సినీనటుడు రజనీకాంత్ ట్వీట్ చేశారు.

'రిషి జీ ఇక లేరని తెలిసి బాధపడ్డాను. ఆయన ఓ గొప్ప మిత్రుడు, గొప్ప కళాకారుడు, కోట్లాది మంది మనసులను గెలుచుకున్న వ్యక్తి. గొప్ప వారసత్వాన్ని కొనసాగించిన వ్యక్తి. ఆయనను కోల్పోవడం పట్ల కలత చెందాను. ఆయనకు తుది వీడ్కోలు పలుకుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి' అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.  ఈ సందర్భంగా ఆయనతో గతంలో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.

'హృదయం ద్రవించింది. నిన్న మనం గొప్ప నైపుణ్యాలున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ను కోల్పోయాం. ఇప్పుడు లెజెండరీ రిషి కపూర్‌ సాబ్‌ను కోల్పోయాం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు' అని టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. రిషికపూర్‌ మృతి పట్ల భారతీయ సినీ పరిశ్రమ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
rishi kapoor
Rajinikanth
Chiranjeevi
Junior NTR

More Telugu News