Boris Johnson: మరోసారి తండ్రయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

Boris johnson once again blessed a baby boy
  • బోరిస్‌కు ఇప్పటికే నలుగురు సంతానం
  • జీవన సహచరి క్యారీ సైమండ్స్‌కు ఇప్పుడు మగబిడ్డ
  • ఇద్దరితో విడాకులు తీసుకున్న జాన్సన్
ఇటీవల కరోనా వైరస్ బారినపడి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (59) మరోమారు తండ్రయ్యారు. జాన్సన్ ప్రస్తుతం క్యారీ సైమండ్స్ (32)తో కలిసి జీవిస్తున్నారు. వీరిద్దరికీ ఈ ఉదయం పండంటి మగ బిడ్డ జన్మించినట్టు బోరిస్ జంట అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య సేవల మెటర్నరీ విభాగానికి ధన్యవాదాలు తెలిపారు. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రధాని జాన్సన్‌కు మాజీ భార్య మెరీనా వీలర్‌తో ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారు. అలెగ్రా మెస్టిన్ అనే మహిళను గతంలో పెళ్లాడిన బోరిస్ 1993లో ఆమె నుంచి విడిపోయి మెరీనా వీలర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. అనంతరం అధికార కన్జర్వేటివ్ పార్టీ కమ్యూనికేషన్స్ హెడ్‌గా పనిచేసిన క్యారీ సైమండ్స్‌తో కలిసి జీవిస్తున్నారు.
Boris Johnson
Britain
carrie symonds
Baby

More Telugu News