Lockdown: ఏపీలో లాక్ డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా.. అదనపు మార్గదర్శకాల విడుదల

Additional guidelines released in AP as part of lockdown easing
  • కేంద్ర మంత్రి అమిత్ షా  సూచనల మేరకు అదనపు మార్గదర్శకాలు 
  • ఈ మార్గదర్శకాల మేరకు ఆయా రంగాల్లో పనులకు అనుమతి
  • ఆర్థిక రంగం, వ్యవసాయం రంగం, ఉద్యాన పనులు చేసుకోవచ్చు  
లాక్ డౌన్ సడలింపులో భాగంగా అదనపు మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల మేరకు ఆయా రంగాలకు సంబంధించిన పనులు చేసుకునేందుకు అనుమతి లభించింది.  

- ఆర్థిక రంగం
- వ్యవసాయ రంగం, ఉద్యాన పనులకు
- ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్
- గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు
- పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు
-  ఈ-కామర్స్ కంపెనీలు, వారి వాహనాలకు
- ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, పుస్తక విక్రయ దుకాణాలు తెరిచేందుకు
- వలస కార్మికులకు రాష్ట్ర పరిధిలోని సొంతూరులో పనిచేసుకోవచ్చు ( ‘కరోనా’
 లక్షణాలు లేనివారికి మాత్రమే)
 - మాల్స్ మినహా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దుకాణాలు, మార్కెట్ కాంప్లెక్స్ లకు అనుమతి లభించింది.
Lockdown
Andhra Pradesh
Government
Additional guide lines

More Telugu News