Ayyanna Patrudu: ఏపీని కేంద్రమే కాపాడాలి..‘ కరోనా’ కట్టడికి ప్రత్యేక బృందాలు పంపాలి: అయ్యన్నపాత్రుడు

Tdp leader Ayyannapatrudu lashes out CM Jagan
  • సీఎం జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
  • జగన్ తీరుతో పొరుగు రాష్ట్రాలు భయపడుతున్నాయి
  • తమ రాష్ట్రాలకు రావొద్దంటూ అడ్డుగోడలు కడుతున్నాయి 
‘కరోనా’ కట్టడిలో ఏపీ సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగా పొరుగు రాష్ట్రాలు భయపడుతున్నాయని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. తమ రాష్ట్రాలకు రావొద్దంటూ సరిహద్దుల వద్ద అడ్డుగోడలు కడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోనూ గ్రామాల మధ్య ప్రజలే కంచెలు వేసే పరిస్థితి నెలకొందని విమర్శించారు. గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోవడానికి జగన్ అసమర్థతే కారణం అని ధ్వజమెత్తారు. ఏపీని కేంద్రమే కాపాడాలని, రాష్ట్రంలో ‘కరోనా’ కట్టడికి కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలని విజ్ఞప్తి చేశారు.
Ayyanna Patrudu
Telugudesam
Andhra Pradesh
Jagan
YSRCP

More Telugu News