pilots: పైలట్లకు రెండు నెలల జీతాలు ఇవ్వలేం: స్పైస్‌ జెట్ ప్రకటన

  • ఏప్రిల్‌, మే నెల జీతాలు ఇవ్వబోమని స్పైస్‌ జెట్ సంస్థ ప్రకటన
  • కార్గో విమానాలు నడుపుతున్న వారికి మినహాయింపు
  • ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో విమానయాన సంస్థ
No pay for April and May  SpiceJet tells its pilots

తమ పైలట్లకు ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఎలాంటి జీతాలు చెల్లించేది లేదని  స్పైస్‌ జెట్‌ సంస్థ తెలిపింది. లాక్‌డౌన్‌ సమయంలో అనుమతించిన కార్గో విమానాలు నడుపుతున్న పైలట్లకు మాత్రమే ఈ  జీతాలు ఇస్తామని చెప్పింది. అది కూడా విమానాలు నడిపిన గంటలకు లెక్కగట్టి చెల్లింపులు ఉంటాయని తెలిపింది.

ఈ మేరకు సంస్థ విమాన ఆపరేషన్ల అధిపతి కెప్టెన్ గుర్ చరణ్  అరోరా.. తమ పైలట్లకు లేఖ రాశారు. విమాన ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలు సడలించిన వెంటనే సర్వీసులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. భారత విమానయాన సంస్థల్లో అత్యంత చౌకగా సేవలు అందించే స్పైస్‌జెట్‌ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.

మరోవైపు తమ సంస్థలో పనిచేస్తున్న మెజారిటీ ఉద్యోగులకు ఏప్రిల్‌ నెల పూర్తి జీతం ఇస్తామని ఇండిగో గత వారమే ప్రకటించింది. ఈ‌ నెల జీతంలో కోతపెట్టాలని  ముందుగా భావించినా.. ప్రధాని సూచన మేరకు దాన్ని విరమించుకుంది. మరోపక్క, ఫిబ్రవరి నెలకు సంబంధించి తమకు ‘ఫ్లైయింగ్ అలవెన్సు’ ఇంకా ఇవ్వలేదని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిర్ ఇండియా పైలట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ పురికి లేఖ రాశారు.

More Telugu News