Corona Virus: నెల్లూరులో కరోనా రోగులకు సేవలందించేందుకు రంగంలోకి దిగిన రోబోలు

  • రోగుల నుంచి డాక్టర్లు, సిబ్బందికి సోకుతున్న వైరస్
  • రోబోలను రంగంలోకి దించిన ప్రభుత్వం
  • ఒకేసారి 40 కేజీల ఆహారం, మందులను సరఫరా చేయగల రోబోలు
Robot deployed to serve corona patients in Nellore District

కరోనా వైరస్ కేసులు ఏపీలో పెరుగుతున్నాయి. రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో లేదా మందులు, ఆహారాన్ని ఇస్తున్న సమయంలో డాక్టర్లు, వైద్య సిబ్బందికి కూడా వైరస్ సోకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు ఆహారం, మందులు అందించేందుకు రోబోలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు రోబోలను అధికారులు రంగంలోకి దించారు.

తొలుత ఈ రోబోలను నెల్లూరు జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఓ రోబో సేవలను అందిస్తోంది. తాజాగా దీనికి మరో రెండు రోబోలు జతచేరనున్నాయి. 40 కేజీల ఆహారం, మందులను ఒకేసారి సరఫరా చేయగలిగిన శక్తి ఈ రోబోల సొంతం కావడం గమనార్హం.

మరోవైపు ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 1,332కి పెరిగింది. మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News