Bhadrachalam: 40 రోజుల తరువాత భద్రాచలంలో ప్రారంభమైన నిత్య కల్యాణాలు!

Kalyana Sevas Repoen from today in Bhadrachalam
  • గత నెల 20 నుంచి ఆగిన కల్యాణాలు
  • నేటి నుంచి పునః ప్రారంభం
  • ఏకాంతంగానే జరుగుతాయన్న అధికారులు
భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయంలో స్వామివారి నిత్య కల్యాణాలు నేటి నుంచి తిరిగి మొదలయ్యాయి. అయితే, ప్రస్తుతానికి కల్యాణాలకు భక్తులను అనుమతించబోమని, వాటిని ఏకాంతంగానే నిర్వహిస్తామని దేవస్థానం అధికారులు వెల్లడించారు.

కాగా, గత నెల 20వ తేదీన కరోనా ప్రబలుతున్న వేళ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కల్యాణ సేవలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆపై శ్రీరామనవమి నాడు ఎంతో వైభవంగా సాగే రాములోరి కల్యాణాన్ని సైతం పరిమిత సంఖ్యలో పూజారులు, అధికారుల మధ్యనే జరిపించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి స్వామివారికి నిత్యమూ జరిగే ఆర్జిత సేవలను ఏకాంతంగా జరిపిస్తామని అధికారులు వెల్లడించారు.
Bhadrachalam
Kalyanam

More Telugu News