Nokia: జట్టుకట్టిన ఎయిర్ టెల్, నోకియా.. రూ. 7,500 కోట్ల డీల్!

  • 5జీ రెడీ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయనున్న నోకియా
  • 3 లక్షలకు పైగా బేస్ స్టేషన్ల నిర్మాణం
  • 5జీ సేవలకు పునాదిరాయన్న నోకియా ప్రెసిడెంట్ రాజీవ్ సూరి
Nokia Signs Deal Worth 7500 Crores with Airtel

స్మార్ట్ ఫోన్ సంస్థ నోకియాతో టెలికం దిగ్గజం భారతి ఎయిర్ ‌టెల్ తాజాగా భారీ డీల్ ను కుదుర్చుకుంది. దాదాపు రూ. 7,500 కోట్ల విలువైన ఈ డీల్ లో భాగంగా, మహారాష్ట్ర, గుజరాత్‌ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది సర్కిళ్లలో ఎయిర్ ‌టెల్‌ కోసం 5జీ రెడీ నెట్ ‌వర్క్ ‌ను నోకియా ఏర్పాటు చేయనున్నట్టు  ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

డీల్ తొలి దశలో ప్రస్తుతానికి 4జీ సేవలకు ఉపయోగపడే 3 లక్షల పైచిలుకు బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసే నోకియా, 5జీ తరంగాలు రాగానే, వాటిని అప్ ‌గ్రేడ్ చేస్తుంది. భవిష్యత్తులో అప్ గ్రేడ్ చేసుకునేందుకు అనువుగా ఈ బేస్ స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టుతో ఎయిర్ టెల్ నెట్‌వర్క్‌ సామర్థ్యం మరింతగా మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డ నోకియా ప్రెసిడెంట్‌ రాజీవ్‌ సూరి, ఈ డీల్ 5జీ సేవలకు కూడా పునాదిరాయిగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కాగా, 2025 నాటికి 8.8 కోట్ల వరకూ 5జీ కనెక్షన్లు ఉంటాయని నిపుణుల అంచనా.

More Telugu News