కరోనా దెబ్బ... వీడియో కాల్ ద్వారా వధువును చూస్తూ.. స్మార్ట్ ఫోన్ కే తాళి కట్టేసిన వరుడు!

29-04-2020 Wed 08:21
  • వేల సంఖ్యలో నిలిచిపోయిన శుభకార్యాలు
  • కేరళలో వీడియో కాల్ లోనే జరిగిపోయిన వివాహం
  • వధువును వీడియోలో చూస్తూ తాళి కట్టేసిన వరుడు
Marriage Via Smartphone in Kerala
లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వారు అక్కడ ఇరుక్కుపోయిన ఈ తరుణంలో వివాహాది శుభకార్యాలూ వేల సంఖ్యలో నిలిచిపోయాయి. కొన్ని మాత్రం హంగు, ఆర్భాటాలు లేకుండా సాగుతున్నాయి. ఇంట్లోనే ఎన్నో పెళ్లిళ్లు, ఐదారుగురు అతిథుల మధ్య జరిగిపోతున్నాయి. మరికొందరు వినూత్నంగా ఆలోచించి, ఉన్న చోటునే ఉండి, పెళ్లి తంతును ముగించేసుకుంటున్నారు. అటువంటిదే ఇది కూడా.

వీడియో కాల్ లో వధువును చూస్తూ, ఆ స్మార్ట్ ఫోన్ కే మూడు ముళ్ళూ వేసేశాడు ఓ యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కేరళలో ఈ వివాహం జరిగినట్టు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ ను ఓ యువకుడు పట్టుకుని వుండగా, వధువును చూస్తూ, స్మార్ట్ ఫోన్ కు వరుడు తాళి కడుతూ ఉంటే.. అక్కడ ఓ మహిళ, వధువు మెడలో తాళి కట్టేసింది. దీంతో పెళ్లి తంతు ముగిసింది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.