Nitin Gadkari: దేశవ్యాప్తంగా రెండుమూడేళ్లలో రహదారుల విస్తరణ ఊపందుకుంటుందన్న గడ్కరీ

  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రవాణాశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్
  • రహదారుల అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడి
  • రాష్ట్రాల్లో భూసేకరణ సమస్యలు తొలగించాలని సూచన
Nitin Gadkari conducts video conference with states and ut transport ministers

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా శాఖ మంత్రులతో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, అంతర్రాష్ట్ర రవాణాపై ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, తద్వారా నిత్యావసరాల రవాణాకు అడ్డంకులు తొలగించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన చెబుతూ, దేశంలో జాతీయ రహదారులు, సాధారణ రహదారుల మౌలిక సదుపాయాల కల్పనకు, జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. వచ్చే రెండేళ్లలో రహదారుల విస్తరణ మరింత భారీగా ఉండనుందని, విస్తరణ పనులు 2 నుంచి 3 రెట్లు అధిక వేగం సంతరించుకుంటాయని భావిస్తున్నట్టు తెలిపారు.

రహదారుల విస్తరణ సమయంలో భూసేకరణకు ఆయా రాష్ట్రాల్లో సమస్యలు ఏర్పడుతున్నాయని, ఈ విధమైన అడ్డంకులు జాతీయ రహదారుల అభివృద్ధి పనుల్లో జాప్యానికి కారణమవుతున్నాయని వివరించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు. అంతేగాకుండా, ఇప్పటివరకు రాష్ట్రాలు వినియోగించకుండా ఉన్న రూ.25,000 కోట్ల మేర నిధులను ఖర్చు చేయాలని సూచించారు.

More Telugu News