Adimulapu Suresh: లాక్ డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం: ఏపీ మంత్రి సురేశ్

AP Minister Suresh says two weeks after the lock down we will conduct ssc exams
  • లాక్ డౌన్ అనంతరం టెన్త్ పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశం
  • ఇందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తాం
  • సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తాం
లాక్ డౌన్ అనంతరం పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. లాక్ డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపారు.

సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని, నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ తయారు చేస్తామని చెప్పారు. కాగా, రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సురేశ్ పాల్గొన్నారు. డిజిటల్, ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ను విస్తృతంగా వాడుకోవాలని కేంద్ర మంత్రి సూచించినట్టు సమాచారం.
Adimulapu Suresh
YSRCP
Andhra Pradesh
SSC
Exams

More Telugu News