Narendra Modi: చైనా నుంచి నిష్క్రమించే కంపెనీలను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉండండి: సీఎంలకు సూచించిన ప్రధాని

  • కరోనా దెబ్బకు చైనా అంటే హడలిపోతున్న కంపెనీలు
  • భవిష్యత్తులో చైనాలో పెట్టుబడుల కొనసాగింపుకు విముఖత!
  • ఈ సమయంలో సమగ్ర ప్రణాళిక అవసరం అన్న మోదీ
PM Modi suggests CMs to attract companies after corona crisis

చైనాలో కరోనా సంక్షోభం అక్కడి ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిందనడంలో సందేహంలేదు. ఈ నేపథ్యంలో అక్కడ పెట్టుబడులను, కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రముఖ కంపెనీలు విముఖత వ్యక్తం చేస్తున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

ఇదే విషయం నిన్నటి వీడియో కాన్ఫరెన్స్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రస్తావించిన విషయం తాజాగా వెల్లడైంది. చైనా నుంచి అనేక కంపెనీలు నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయని, అక్కడి నుంచి వచ్చేస్తున్న కంపెనీలను ఆకర్షించేందుకు సీఎంలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

చైనాకు ప్రత్యామ్నాయంగా నిలిచే క్రమంలో రాష్ట్రాలు పుష్కలమైన మానవవనరులు, నైపుణ్యం, మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. "కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత చైనా వెలుపల అవకాశాలను అన్వేషించేందుకు అనేక కంపెనీలు ప్రయత్నిస్తాయి. ఇలాంటి సంస్థల నుంచి రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు మనందరం ఓ సమగ్ర ప్రణాళికతో పనిచేయాల్సి ఉంటుంది" అని వివరించారు.

More Telugu News