Jagan: ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది: సీఎం జగన్

  • అందరి ఆశీర్వాదంతో ఈ పథకాన్ని ప్రారంభించాం
  • పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఒక్క చదువే
  • ఈ పథకంలో భాగంగా ‘వసతి దీవెన’, ‘విద్యా దీవెన   
CM Jagan Inaugurates Jagananna Vidya Deevina

పేద విద్యార్థుల కోసం జగనన్న విద్యా దీవెన పథకంను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, విద్యార్థుల తల్లులతో  జగన్ మాట్లాడారు. ఈ పథకాన్ని ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, అందరి ఆశీర్వాదంతో ఈ పథకాన్ని ప్రారంభించామని అన్నారు. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఒక్క చదువే అని, మంచి చదువులతోనే పేదల బతుకులు మారతాయని చెప్పారు. విద్యా దీవెనలో భాగంగా బోర్డింగ్, లాడ్జింగ్ కోసం ‘వసతి దీవెన’, పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ‘విద్యా దీవెన’ అనే రెండు పథకాలను తీసుకొచ్చామని అన్నారు.

వచ్చే విద్యా సంవత్సరం 2020-21 కి సంబంధించి ప్రతి త్రైమాసికం పూర్తయిన తర్వాత తల్లుల ఖాతాలోనే నేరుగా ఫీజ్ రీయింబర్స్ మెంట్ డబ్బులు వేస్తామని చెప్పారు. విద్యార్థుల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కు ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నామని, ఈ నగదు కూడా తల్లుల అకౌంట్ లోనే వేస్తున్నామని అన్నారు. దీని వల్ల ఆ కుటుంబాలు అప్పుల పాలు కాకుండా ఉంటాయని, తమ పిల్లలను గొప్పగా చదివించ గలుగుతారని ఆశిస్తున్నానని అన్నారు. తమ పిల్లలు విద్యనభ్యసించే కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ బాగా లేకపోయినా, వసతులు లేకపోయినా ప్రశ్నించే అధికారం విద్యార్థుల తల్లులకు ఉంటుందని అన్నారు.

మొదటిసారిగా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నా తండ్రి తీసుకొచ్చారు

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాడు సీఎం హోదాలో మొదటిసారిగా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. పేదవాళ్లు పెద్ద చదువులు చదివితే వారి బతుకులు బాగుపడతాయని ఆయన నమ్మారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందాక ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పూర్తిగా నీరు గార్చారని అన్నారు.

  • Loading...

More Telugu News