ఒక హీరోగా శర్వానంద్ .. మరో హీరోగా సిద్ధార్థ్!

28-04-2020 Tue 14:43
  • 'ఆర్ ఎక్స్ 100'తో భారీ విజయం
  • 'మహాసముద్రం' విషయంలో ఆలస్యం
  • శర్వానంద్ జోడీగా సాయిపల్లవి  
Mahasamudram Movie
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన అజయ్ భూపతి, ఇంతవరకూ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయాడు. అందుకు కారణం ఆయన సిద్ధం చేసుకున్న 'మహాసముద్రం' కథపట్ల కొంతమంది కథానాయకులు ఆసక్తిని చూపకపోవడమే. కొంతమంది హీరోలు ఈ కథ విని తమ నిర్ణయాన్ని నాన్చడం వలన అజయ్ భూపతికి ఆలస్యం అవుతూ వచ్చిందట.

ఈ సినిమాలో ఇద్దరు కథానాయకులకు ప్రాధాన్యత ఉంటుంది. ఒక కథానాయకుడి పాత్రకిగాను శర్వానంద్ ను ఎంపిక చేసిన ఆయన, మరో కథానాయకుడి పాత్ర కోసం అన్వేషిస్తూ వచ్చాడు. తాజాగా సిద్ధార్థ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తెలుగులో గతంలో వరుస హిట్లు కొట్టిన సిద్ధార్థ్ కి మంచి క్రేజ్ వుంది. అయితే, కొన్నాళ్లుగా హిట్లు, సినిమాలు లేక గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ను భర్తీ చేయడం కోసం ఆయన దీనిని అంగీకరించాడని అంటున్నారు. శర్వానంద్ జోడీగా సాయిపల్లవిని తీసుకున్నారు. సిద్ధార్థ్ సరసన ఎవరనేది తెలియాల్సి వుంది.