New Delhi: ఢిల్లీలో పలు రంగాలకు పెద్ద ఎత్తున లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ప్రకటించిన ప్రభుత్వం

  • వెటర్నరీ ఆసుపత్రులు, పాథలాజికల్‌ లాబొరేటరీస్‌కి గ్రీన్ సిగ్నల్‌
  • శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బంది అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి
  • అత్యవసర పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు చేయవచ్చు
  • ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఫ్యూరిఫైయర్లు బాగు చేసే సిబ్బందికి అనుమతి
lockdown relaxations in delhi

లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ఢిల్లీ  ప్రభుత్వం వాటిని ప్రకటించింది. హెల్త్‌కేర్ రంగంలో వెటర్నరీ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, పాథలాజికల్‌ లాబొరేటరీస్‌, వ్యాక్సిన్‌, ఔషధాల అమ్మకాలు, సరఫరాలపై నిబంధనలు సడలించి వాటికి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

రవాణా రంగంలో శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బంది అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఇచ్చింది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో వీరు విమాన ప్రయాణాలు చేయవచ్చు. షెల్టర్‌ హోంలో దివ్యాంగులు, మానసిక వైకల్యంతో బాధ పడుతున్న వారు, చిన్న పిల్లలు, వితంతు, వృద్ధాశ్రమాల్లో అన్ని కార్యక్రమాలు కొనసాగేలా అనుమతులు ఇచ్చింది.

అలాగే, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వాటర్‌ ఫ్యూరిఫైయర్లు బాగు చేసే వారితో పాటు స్వయం ఉపాధి పొందే పలు సిబ్బందికి అనుమతి ఇచ్చింది. ఎలక్ట్రిక్‌ ఫ్యాన్ల షాపులు, బుక్‌స్టోర్లు తెరిచేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది.

కాగా, బడులు మూసేసే ఉంచాలని, పిల్లలకు పాఠాల కోసం ఆన్‌లైన్‌ టీచింగ్ నిర్వహించుకోవచ్చని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ దేవ్ ఆదేశించారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 3,100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 54 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News