Chandrababu: ఏపీలో కరోనా నియంత్రణ చేతకాక, పాలకులు చేతులెత్తేశారు: చంద్రబాబు

  • కరోనా సంగతి ఎలా ఉన్నా ఎన్నికలు జరిపించాలన్న తొందర
  • ఇలాంటి పరిస్థితుల్లో పౌరులుగా మనమే మన బాధ్యతను నిర్వర్తించాలి
  • మన ఊరు-మన వార్డు-మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి
  • సమాజాన్ని సురక్షితంగా ఉంచుదాం
chandrababu fires on ap govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. 'విపత్తులు వచ్చినప్పుడే నాయకత్వ సమర్థత బయటపడుతుంది. కానీ, ప్రస్తుతం ఏపీ పరిస్థితి చూస్తే, కరోనా నియంత్రణ చేతకాక 'కరోనాతో కలిసి జీవించాల్సిందే' అంటూ పాలకులు చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. కరోనా సంగతి ఎలా ఉన్నా ఇక ఎన్నికలు జరిపించాలి అన్న తొందరలో ఉన్నారు పాలకులు' అని చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.  

'ఇలాంటి పరిస్థితుల్లో పౌరులుగా మనమే మన బాధ్యతను నిర్వర్తించాలి. మన ఊరు-మన వార్డు-మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. ఆరోగ్యంలో ముందు జాగ్రత్తలు పాటిస్తూ, శారీరక ఆరోగ్యాన్ని, మానసిక దృఢత్వాన్నీ పెంచుకోవాలి. మనం క్షేమంగా ఉందాం. సమాజాన్ని సురక్షితంగా ఉంచుదాం' అని ప్రజలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రజలకు బహిరంగ ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ లేఖను కూడా చంద్రబాబు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

More Telugu News