Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు లేదు: ట్రంప్

Donald trump rules out changing usa presidential election schedule
  • నవంబర్ మూడో తేదీనే ఎన్నిక ఉంటుంది
  • షెడ్యూల్‌లో మార్పు ఎందుకు?
  • కరోనా నేపథ్యంలో వాయిదా వేయాలన్న డెమోక్రటిక్ అభ్యర్థి
అమెరికా అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండబోదని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్తామని చెప్పారు. నవంబర్ మూడో తేదీనే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసే విషయాన్ని ఆలోచించాలని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న జో బైడెన్ కోరారు. ఈ విషయంపై మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇచ్చారు. కరోనా నేపథ్యంలో కూడా ఎన్నికల తేదీల్లో మార్పులు ఉంటాయని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు ఎందుకన్నారు. నవంబర్ 3 మంచి తేదీ అని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.
Donald Trump
rules out
changing
USA
presidential
election

More Telugu News