Viziangaram: ఖరగ్‌పూర్ ఐఐటీలో విజయనగరం విద్యార్థి ఆత్మహత్య

Vizianagaram student suicide in Kharagpur IIT
  • ఖరగ్‌‌పూర్ ఐఐటీలో రీసెర్చ్ స్కాలర్
  • హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య
  • ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు
ఖరగ్‌పూర్ ఐఐటీలో విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రీసెర్చ్ స్కాలర్ అయిన కొండలరావు (28) ఆదివారం రాత్రి ఉరేసుకున్నట్టు తెలుస్తోంది. అతడు ఉంటున్న హాస్టల్ గది తలుపులు సోమవారం ఎంతకీ తెరవకపోవడంతో అనుమానించిన తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా కొండలరావు సీలింగుకు వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విషయం తెలిసిన వెంటనే కొండలరావు తల్లిదండ్రులు ఖరగ్‌పూర్ బయలుదేరారు.
Viziangaram
kharagpur IIT
Student
Suicide

More Telugu News