Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. అమరావతి మెట్రో రైల్ పేరు మార్పు!

Andhrapradesh Govt another shocking decision
  • ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మార్పు
  • నిన్న ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • మెట్రో ప్రాజెక్టుల సౌలభ్యం కోసమేనన్న సర్కారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మారుస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టుల సౌలభ్యం కోసమే పేరు మార్చినట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది.

విశాఖపట్టణంలో తలపెట్టిన మెట్రోకు కూడా అమరావతి పేరే ఉండడంతో ప్రాజెక్టు పేరును మార్చినట్టు వివరించింది. గతంలో నాగ్‌పూర్ మెట్రో ప్రాజెక్టు పేరును మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్టు లిమిటెడ్‌గా మార్చినట్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. అలాగే, లక్నో మెట్రో ప్రాజెక్ట్ పేరును ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్చారని తెలిపింది.
Andhra Pradesh
Amaravati
Metro rail

More Telugu News