Mumbai: నర్సు యూనిఫాంలో ఆసుపత్రికి వెళ్లిన ముంబై మేయర్!

  • ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్
  • గతంలో నర్సుగా పనిచేసిన పెడ్నేకర్
  • ఈ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు నాకు తెలుసన్న మేయర్
Mumbai Mayor visits Hospital

‘కరోనా’ బాధితులకు సేవలందించే  వైద్యులు, వైద్య సిబ్బంది ఎంతగా శ్రమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రంగంలో పని చేసే వారికి లేదా పని చేసిన వారికి ఆ ఇబ్బందులు ఏవిధంగా ఉంటాయో తెలుస్తుంది. ఒకప్పుడు నర్సుగా పని చేసిన ప్రస్తుత ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ బీవైఎల్ నాయర్ హాస్పిటల్ ను ఇవాళ సందర్శించారు.

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నడుపుతున్న ఈ హాస్పిటల్ కు ఆమె నర్సు యూనిఫాంలో వెళ్లారు. ఆసుపత్రి సిబ్బందిని కలిసి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, గతంలో తానూ నర్సుగా పనిచేశానని, ఈ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు తనకు తెలుసని అన్నారు. నర్సింగ్ సిబ్బందికి ధైర్యం చెప్పేందుకే తాను నర్సు యూనిఫాంలో వెళ్లానని, ప్రస్తుత సంక్షోభ సమయంలో మనమంతా కలిసికట్టుగా నిలిచి ఈ పోరాటాన్ని కొనసాగించాల్సి ఉందని అన్నారు.

More Telugu News