Mahesh Babu: రాజమౌళి సినిమా కోసం గ్యాప్ ఇవ్వని మహేశ్ బాబు

Mahesh Babu
  • పరశురామ్ తో మహేశ్ బాబు మూవీ
  • తదుపరి సినిమా అనిల్ రావిపూడితో
  • 2022లో థియేటర్లకు రాజమౌళి సినిమా
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేశ్ బాబు రెడీ అవుతున్నాడు. లాక్  డౌన్ తీసేసిన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. పరిణతితో కూడిన లవర్స్ మధ్య నడిచే కథగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దాదాపు రెండేళ్ల తరువాత ఆ  సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చని చెప్పుకుంటున్నారు.

అప్పటివరకూ మహేశ్ బాబు మరో సినిమా చేయడేమోనని అభిమానులు నిరాశకి లోనయ్యారు. కానీ మహేశ్ బాబు గ్యాప్ రాకుండా చూసుకుంటున్నాడట. రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ముందే పరశురామ్ సినిమా విడుదలైపోతుంది. రాజమౌళి సినిమాలో తన పోర్షన్ షూటింగు మొదలయ్యేసరికి అనిల్ రావిపూడి సినిమాను కూడా మహేశ్ బాబు పూర్తిచేసే ఆలోచనలో వున్నాడట. ఈ ఏడాదిలో పరశురామ్ సినిమాను .. వచ్చే ఏడాదిలో అనిల్ రావిపూడి మూవీని .. 2022లో రాజమౌళి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లానింగ్ తో మహేశ్ బాబు వున్నాడని అంటున్నారు.
Mahesh Babu
Rajamouli
Parashuram
Anil Ravipudi

More Telugu News