Sensex: ఆర్బీఐ తాజా ప్రకటనతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • మ్యూచువల్ ఫండ్ల రంగానికి రూ. 50 వేల ప్యాకేజీ ప్రకటించిన ఆర్బీఐ
  • 416 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 128 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
RBI statement boosts markets

కరోనా వైరస్ నేపథ్యంలో డీలా పడ్డ ఆర్థిక వ్యవస్థకు జీవం పోసేందుకు ఆర్బీఐ నేడు కీలక ప్రకటన చేసింది. మ్యూచువల్ ఫండ్ల రంగంలో ద్రవ్య లభ్యతను పెంచేందుకు రూ. 50 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 416 పాయింట్లు లాభపడి 31,743కి పెరిగింది. నిఫ్టీ 128 పాయింట్లు పుంజుకుని 9,282కి చేరుకుంది. పవర్ మినహా అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (6.33%), యాక్సిస్ బ్యాంక్ (5.74%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (5.15%) ఐసీఐసీఐ బ్యాంక్ (3.85%), బజాజ్ ఫైనాన్స్ (3.45%).

టాప్ లూజర్స్;
ఎన్టీపీసీ (-1.13%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.12%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.83%), భారతి ఎయిర్ టెల్ (-0.48%), ఐటీసీ లిమిటెడ్ (-0.11%).

More Telugu News