Vellampalli Srinivasa Rao: అన్నదానం చేసే పరిస్థితి ఉన్న ఆలయాల్లో 50 వేల మందికి సరిపడా ఆహారం తయారు చేయిస్తున్నాం: ఏపీ మంత్రి వెల్లంపల్లి

AP Minister Vellampalli tells government prepares food in temples for needy
  • రాష్ట్రంలో ఆర్థికలోటు ఉందన్న మంత్రి
  • పేద అర్చకులకు ఆర్థికసాయం అందించినట్టు వెల్లడి
  • ఇమామ్ లు, మౌజన్లకు కూడా సాయం అందిస్తామని వివరణ
రాష్ట్రంలో ఆర్థికలోటు ఉన్నా ప్రతి పథకం కొనసాగిస్తున్నామని ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అన్నదానం చేసే పరిస్థితి ఉన్న ఆలయాల్లో 50 వేల మందికి సరిపడే ఆహారాన్ని తయారు చేయించి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలోని పేద అర్చకులకు ఆర్థికసాయం అందజేస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు అర్చక సంక్షేమ నిధి నుంచి సుమారు 2,500 దేవస్థానాల్లో తక్కువ జీతాలు అందుకుంటున్న అర్చకులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు అందించినట్టు మంత్రి వివరించారు. అంతేకాకుండా, చర్చిల్లో పనిచేసే పాస్టర్లు, మసీదులకు చెందని మౌజన్లు, ఇమామ్ లకు కూడా ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు.
Vellampalli Srinivasa Rao
Food Distribution
Temples
Andhra Pradesh
Lockdown

More Telugu News