Harshavardhan: 'ఖలేజా' మూవీ ఆడకపోవడం ఆశ్చర్యం: హర్షవర్ధన్

  • పంచ్ డైలాగ్స్ కి నేను వ్యతిరేకం
  • 'ఖలేజా' సినిమా అంటే నాకు ఇష్టం
  • త్రివిక్రమ్ గొప్పగా రాశాడన్న హర్ష  
Harshavardhan

నటుడిగా, సంభాషణల రచయితగా హర్షవర్ధన్ కి మంచి క్రేజ్ వుంది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ మాట్లాడుతూ, పంచ్ డైలాగ్స్ గురించి ప్రస్తావించాడు. "పంచ్ అనే మాటకి అర్థమే నాకు తెలియదు. పంచ్ డైలాగ్స్ కోసం ప్రాణాలు తీసుకోవడమే నాకు నచ్చదు. ఏ డైలాగ్ అయినా పాత్ర స్వభావంలో నుంచి పుట్టాలి .. అది అలవోకగా జరిగిపోవాలి. అంతేగానీ కొన్ని జోక్స్ ని ఆర్డర్ లో అందిస్తున్నట్టుగా వుండకూడదు.

టప టపా డైలాగ్స్ ను చెప్పేసుకుంటూ వెళ్లడం నాకు నచ్చదు .. ఎందుకో అవి నాకు సహజంగా అనిపించవు. త్రివిక్రమ్ గారు పంచ్ డైలాగ్స్ లేకుండా రాసిన 'ఖలేజా' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమా ఆడకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ సినిమాలో మహేశ్ బాబు నటన  గొప్పగా ఉంటుంది. త్రివిక్రమ్ చిన్న చిన్న డైలాగ్స్ తో సీన్స్ ను పండించిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం. పాత్రల స్వభావం నుంచి డైలాగ్స్ రావడం వల్లనే అవి అంతగా పేలాయి" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News