Kanna Lakshminarayana: ఇలాంటి 'ఏకగ్రీవ' దౌర్జన్య కాండ మరెక్కడా చూడలేదు: గవర్నర్ కు కన్నా లేఖ

kanna laxminarayana fire on ap govt
  • వైసీపీ తీరుపై ఫిర్యాదు
  • స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రద్దు చేయాలి
  • దౌర్జన్యాలతో ఏపీలోని చాలా చోట్ల వైసీపీ ఏకగ్రీవం చేయించుకుంది  

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ రాసి వైసీపీ తీరుపై ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ప్రారంభించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం రద్దు చేయాలని అన్నారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలతో ఏపీలోని చాలా చోట్ల  ఏకగ్రీవం చేసుకుందని ఆరోపించారు.

ఇందుకు పలు ప్రాంతాల్లో అధికారులు, పోలీసులు కూడా సహకరించారని కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు. రాష్ట్ర చరిత్రలో తాను ఇలాంటి దౌర్జన్యకాండ ఎన్నడూ చూడలేదని తెలిపారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక వైసీపీ రాష్ట్రంలో వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని ఆయన అన్నారు. కాగా, ఏపీలో కరోనా విజృంభణ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేసిన విషయం తెలిసిందే.  

  • Loading...

More Telugu News