Gangula Kamalakar: తెలంగాణ నెంబర్ వన్... బీజేపీ పాలిత రాష్ట్రాలు ఫెయిల్: మంత్రి గంగుల

Telangana in first place in controlling corona virus
  • లాక్ డౌన్ ను తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తోంది
  • బీజేపీ నేతలు రాజకీయ విమర్శలు చేస్తున్నారు
  • ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సరికాదు
కరోనా వైరస్ కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని... దీంతో, కేసుల సంఖ్య తగ్గిందని అన్నారు. వైరస్ కట్టడికి సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు.

బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. గుజరాత్, యూపీ రాష్ట్రాల్లో కరోనాను కట్టడి చేయడంలో బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి కూడా దారుణంగా ఉందని చెప్పారు. బీజేపీ నేతలు రాజకీయ విమర్శలు చేస్తున్నారని... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.
Gangula Kamalakar
TRS
BJP
Corona Virus
Lockdown

More Telugu News