Sikhar Dhawan: ఛటేశ్వర్ పుజారాను ట్రోల్ చేసిన శిఖర్ ధావన్

Dhawan trolls Pujara
  • లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమవుతున్న క్రికెటర్లు
  • క్రికెట్ మైదానాన్ని మిస్ అవుతున్నానన్న పుజారా
  • నిజమా... మాకు తెలియదే అంటూ ధావన్ ట్రోల్
ప్రస్తుత భారత జట్టులో టెస్ట్ క్రికెట్ ఎక్స్ పర్ట్స్ ఎవరంటే... ఎవరైనా ఛటేశ్వర్ పుజారా పేరునే చెపుతారు. క్రీజులో పాతుకుపోయి... అద్భుతమైన టెక్నిక్ తో పుజారా కొట్టే షాట్లకు ప్రతి క్రికెట్ అభిమాని ఫిదా అవుతాడు.

ఇక విషయంలోకి వస్తే, ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా క్రికెటర్లందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. లాక్ డౌన్ కు ముందు జరిగిన రంజీట్రోఫీలో అద్భుతంగా ఆడిన పుజారా తన సౌరాష్ట్ర జట్టును విజేతగా నిలిపాడు. లాక్ డౌన్ నేపథ్యంలో క్రికెట్ మైదానాన్ని తాను ఎంతగానో మిస్ అవుతున్నానని సోషల్ మీడియా ద్వారా పుజారా చెప్పాడు. గతంలో నెట్ లో ప్రాక్టీస్ చేసిన ఫొటోను షేర్ చేశాడు.

సోషల్ మీడియాలో పుజారా కామెంట్ ను చూసిన వెంటనే టీమిండియా మరో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ స్పందిస్తూ, సరదాగా ట్రోల్ చేశాడు. 'నిజమా? నీవు క్రికెట్ మిస్ అవుతున్నట్టు మాకు తెలియదే' అంటూ ఆటపట్టించాడు. ఆ తర్వాత ఇతర క్రికెటర్లు కూడా సరదాగా పుజారాను ఆట పట్టించారు. 'మాకు ఆ విషయం తెలుసు పుజారా' అని మురళీ విజయ్ అన్నాడు. ఉమేశ్ యాదవ్  'లాఫింగ్' ఎమోజీని పోస్ట్ చేశాడు.
Sikhar Dhawan
Cheteshwar Pujara
Lockdown
Team India

More Telugu News