Corona Virus: వ్యాక్సిన్ రాకపై: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అలా.. బ్రిటన్ మంత్రి ఇలా!

  • కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచం బిజీ
  • సెప్టెంబరు నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న యూనివర్సిటీ
  • ఈ ఏడాది కష్టమేనన్న డొమినిక్ రాబ్
Britain Minister Says about Corona Vaccine

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఈ భూమ్మీది నుంచి వెళ్లగొట్టేందుకు విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం దీనికి విరుగుడు తయారు చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే కొన్ని దేశాలు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న ప్రకటనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై బ్రిటన్ నీళ్లు చల్లింది. కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది అందుబాటులోకి రావడం కష్టమేనని మంత్రి డొమినిక్ రాబ్ పేర్కొన్నారు. వైరస్‌పై వీలైనంత త్వరగా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.

వ్యాక్సిన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్న ఆయన.. ఈ ఏడాది వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కష్టమేనన్నారు. ఇటీవల ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఓ మహిళపై వ్యాక్సిన్ ప్రయోగించారు. ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో డొమినిక్ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. సెప్టెంబరు నాటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, డిసెంబరు నాటికి దానిని ప్రపంచానికి పరిచయం చేస్తామని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇటీవలే ప్రకటన చేసింది. అందుకు విరుద్ధంగా ఇప్పుడు మంత్రి ప్రకటించడం చర్చనీయాంశమైంది.

More Telugu News