Gold: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. కళ తప్పిన అక్షయ తృతీయ!

  • గతేడాదితో పోలిస్తే అమ్మకాల్లో 95 శాతం క్షీణత
  • ఆన్‌లైన్ విక్రయాలకు స్పందన కరవు
  • దీపావళి నాటికి పుంజుకుంటుందన్న వ్యాపారులు
Jewellery shops affected by lockdown on Akshay Tritiya

లాక్‌డౌన్ ఎఫెక్ట్ ఈసారి అక్షయ తృతీయపై బాగానే పడింది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు కిక్కిరిసిపోయే నగల దుకాణాలు ఈసారి లాక్‌డౌన్ కారణంగా మూతబడ్డాయి. ఫలితంగా అమ్మకాలు దారుణంగా క్షీణించాయి. కొందరు నగల వ్యాపారులు మాత్రం డిజిటల్ పద్ధతిలో కొనుగోళ్లకు అవకాశం కల్పించినప్పటికీ స్పందన మాత్రం అంతంతమాత్రమేనని పరిశ్రమల సమాఖ్య తెలిపింది.

గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 95 శాతం అమ్మకాలు క్షీణించాయని, నామమాత్రంగా ఐదు శాతం మాత్రమే విక్రయాలు జరిగాయని వివరించింది. మరోవైపు, బంగారం ధరలు 52 శాతానికిపైగా పెరగడం కూడా అమ్మకాలు తగ్గడానికి మరో కారణమని పేర్కొంది.

నగల కొనుగోలు సమయంలో మహిళలు ఒకటికి రెండుసార్లు పరీక్షించి, ఒంటిపై అలంకరించుకుని చూసుకున్నాకే కొనుగోలు చేస్తారని, ఆన్‌లైన్‌లో ఆ వెసులుబాటు ఉండదని, కాబట్టే డిజిటల్ విక్రయాలకు అంతగా స్పందన రాలేదని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి చైర్మన్ అనంత పద్మనాభన్ పేర్కొన్నారు. త్వరలోనే పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని, దీపావళి నాటికి బంగారం విక్రయాలు ఊపందుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News