Retired Employs: రిటైర్డ్ ఉద్యోగులకు ఈసారి పూర్తి పెన్షన్... ప్రభుత్వ నిర్ణయం

AP Government decides to pay full pension to retired employs
  • గత నెల సగం పెన్షన్ తో సరిపెట్టుకున్న రిటైర్డ్ ఉద్యోగులు
  • వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తిజీతాలు
  • మిగిలిన ఉద్యోగులకు సగం జీతమే!
లాక్ డౌన్ కారణంగా ఆదాయం తగ్గి, ఖర్చులు పెరగడంతో ప్రభుత్వాలు పొదుపు మార్గాలు పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏపీ ప్రభుత్వం గత నెలకు సంబంధించిన వేతనాల్లో కోతలు విధించింది. అయితే ఈ నెలకు సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పట్లాగానే, కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి జీతాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మిగిలిన ఉద్యోగులకు గత నెలలాగే 50 శాతం వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
Retired Employs
Andhra Pradesh
Lockdown
Pension
Corona Virus

More Telugu News