Indians: 50కి పైగా దేశాల్లో కరోనా బారిన పడిన భారతీయులు... 40 మంది మృత్యువాత

Indians affected by corona in fifty more countries
  • విదేశీ గడ్డపై 6,300 మంది భారత పౌరులకు కరోనా పాజిటివ్
  • గల్ఫ్ దేశాల్లో 2 వేల మందికి పైగా భారతీయులకు ఇన్ఫెక్షన్
  • సింగపూర్ లో 90 శాతం భారతీయులు కరోనా బాధితులే!
అనేక దేశాల్లో ఉంటున్న భారతీయులను కూడా కరోనా వైరస్ భూతం వదల్లేదు. దాదాపు 50కి పైగా దేశాల్లో 6,300 భారతీయులకు కరోనా సోకింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అత్యధిక దేశాలు రవాణా నిలిపివేయడంతో విదేశాల్లో ఉన్న భారత పౌరులు స్వదేశానికి రావడం సాధ్యంకాలేదు. దాంతో ఎక్కడివాళ్లు అక్కడ చిక్కుకుపోయారు. ఏప్రిల్ 16 నాటికి 3,336గా ఉన్న విదేశాల్లోని కరోనా బాధిత భారతీయుల సంఖ్య గడచిన 9 రోజుల్లో రెట్టింపైంది. ఇప్పటివరకు 40 మంది చనిపోయినట్టు గుర్తించారు.

సింగపూర్ లో ఉంటున్న 90 శాతం భారతీయులకు కరోనా సోకినట్టు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోనూ భారత పౌరులకు ఈ మహమ్మారి బెడద తప్పలేదు. కువైట్, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈల్లో 2000కు పైగా మనవాళ్లు కరోనా ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. విదేశాల్లో ఉన్న వారు రావడంతోనే భారత్ లో కరోనా వ్యాప్తి మొదలైంది. ఈ కారణంగానే భారత ప్రభుత్వం విదేశాల్లో ఉన్నవారిని రావొద్దని, దేశంలో లాక్ డౌన్ విధించినందున ఎక్కడివారు అక్కడే ఉండాలని సూచించింది.
Indians
Corona Virus
Positive Cases
Deaths
Singapore
Gulf

More Telugu News