హర్యానా మాదిరి ఏపీ జర్నలిస్టులకూ రూ.10 లక్షల బీమా కల్పించాలి: కన్నా

26-04-2020 Sun 14:06
  • ‘కరోనా’ తో పాత్రికేయులకు ఎన్నో ఇబ్బందులు
  • ఏపీలోనూ కొందరు జర్నలిస్టులు దీని బారిన పడ్డారు
  • సీఎం జగన్ కు కన్నా లేఖ
Kanna Lakshmi Narayana writes a letter to CM Jagan

‘కరోనా’ నేపథ్యంలో పాత్రికేయులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీలోనూ కొందరు జర్నలిస్టులు వార్తా సేకరణకు వెళ్లిన సమయంలో ‘కరోనా’ బారినపడ్డారని, పాత్రికేయులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తూ సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. హర్యానా మాదిరి ఏపీలోనూ జర్నలిస్టులకు రూ.10 లక్షల బీమా కల్పించాలని  కోరారు.