Kanna Lakshminarayana: చిరు వ్యాపారస్తులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు: బీజేపీ నేత కన్నా

AP BJP Leader Kanna writes a letter to CM Jagan
  • తయారీ, సేవారంగం, వ్యాపార సంస్థలకు ఆర్థిక ఇబ్బందులు
  • దయనీయ స్థితిలో ఉన్న వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి  
  • ఏపీ సీఎం జగన్ కు కన్నా లేఖ

ఏపీ సీఎం జగన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ లేఖ రాశారు. లాక్ డౌన్ తో తయారీ, సేవారంగం, వ్యాపార సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా నష్టపోయాయని అన్నారు.

చిరు వ్యాపారస్తులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారని, దయనీయ స్థితిలో ఉన్న వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. సాధారణ స్థితి వచ్చే వరకు విద్యుత్ బిల్లులను వాయిదా వేయాలని, చిరు వ్యాపారస్తులకు మూడు నెలల పాటు మినహాయింపు ఇవ్వాలని, అప్పుడే వాళ్లు ఆర్థిక సమస్యల నుంచి కోలుకునే అవకాశం ఉందని తన లేఖలో కన్నా అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News