Pawan Kalyan: ఏపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

Pawankalyan demands AP Government
  • అకాల వర్షాలతో  రైతులు  నష్టపోయారు
  • వరి, మొక్కజొన్న, ఉద్యానవన రైతులకు కన్నీరే మిగిలింది
  • మామిడి రైతుల పరిస్థితి కూడా 
ఏపీలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. వరి, మొక్కజొన్న, ఉద్యాన వన పంటల రైతులకు కన్నీరే మిగిలిందని, ప్రభుత్వం సత్వరం స్పందించి వారికి పెట్టుబడి రాయితీ అందించాలని సూచించారు.

అదే విధంగా, దెబ్బతిన్న వరి రైతులకు ఉపశమన పథకాలు అమలు చేయాలని, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మామిడి రైతుల ఆశలను  ‘కరోనా,’ అకాల వర్షాలు బాగా దెబ్బతీశాయని, ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో నీటి తీరువా రెట్టింపు చేయాలనే ప్రతిపాదన సరికాదని అన్నారు.
Pawan Kalyan
Janasena
Andhra Pradesh
Government

More Telugu News