Hyderabad: హైదరాబాద్ లో 45 కంటైన్ మెంట్ల జోన్ల ఎత్తివేత!

Officials Remove 45 Containment Zones in Hyderabad
  • కోలుకున్న కరోనా బాధితులు
  • కొత్త కేసులు రాకపోవడంతో ఆంక్షల సడలింపు
  • సామాజిక దూరం తప్పనిసరన్న అధికారులు
హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న కంటైన్ మెంట్ జోన్లలో 45 జోన్లను ఎత్తివేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తులు కోలుకోవడం, ఆపై కొత్త కేసులు నమోదు కాకపోవడం, కాంటాక్టు కేసుల జాడ లేకపోవడంతో దశల వారీగా ఈ జోన్లలో నిబంధనలను సడలిస్తూ వచ్చారు.

ఇక ఇప్పుడు ఈ జోన్లలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి కావడంతో నిబంధనలను తొలగించామని, అయినా ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, మిగతా ప్రాంతాల్లో మాదిరిగా తగు జాగ్రత్తలు తీసుకుని, తమతమ రోజువారీ పనులను చేసుకోవచ్చని వెల్లడించారు. మరికొన్ని జోన్లలో రేపటి నుంచి దశలవారీగా ఆంక్షలను సడలించనున్నట్టు వెల్లడించారు.
Hyderabad
Containment Zones
Lockdown

More Telugu News