Text Message: ఈ మెసేజ్ వచ్చిందంటే ఆపిల్ ఫోన్, వాచ్ ఏదైనా క్రాష్!

  • ఆపిల్ డివైస్ లను కుప్పకూల్చేస్తున్న మెసేజ్
  • మెసేజ్ లో ఇటలీ జెండా, సింధీ గుర్తులు
  • ఐఫోన్, ఆపిల్ వాచ్, మాక్, ఐపాడ్ లకు పెనువిఘాతంలా మారిన సందేశం
Cryptic text message that crashes Apple devices

హ్యాకర్లు కంప్యూటర్లను, స్మార్ట్ ఫోన్లను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు మాల్వేర్లు, స్పైవేర్లు చొప్పిస్తుంటారు. అందుకోసం కొన్ని లింకులను పంపిస్తారు. ఆ లింకులను క్లిక్ చేస్తే చాలు, సదరు వైరస్ చొరబడుతుంది. తాజాగా ఆపిల్ సంస్థ ఉత్పత్తులైన ఐఫోన్, ఆపిల్ వాచ్, ఐపాడ్, మాక్ లకు ఓ టెక్ట్స్ మెసేజ్ పెను విఘాతంలా పరిణమించింది.

 ఈ టెక్ట్స్ సందేశం వస్తే ఆపిల్ ఉత్పత్తులు క్రాష్ అవుతున్నట్టు గుర్తించారు. ఈ మెసేజ్ లో కొన్ని సంజ్ఞలు, ఇటలీ జాతీయ జెండా, సింధీ చిహ్నాలు ఉన్నాయని యూజర్లు చెబుతున్నారు. ఈ సందేశం వస్తే క్రాష్ అవడం గానీ, టచ్ ప్యాడ్ పూర్తిగా మొరాయించడం కానీ జరుగుతోందని పలువురు వెల్లడించారు.

ఈ లోపాన్ని గుర్తించిన ఆపిల్ సంస్థ ఇప్పటికే సెక్యూరిటీ ప్యాచ్ ను రిలీజ్ చేసింది. ఆయా డివైస్ ల్లోని సాఫ్ట్ వేర్ వెర్షన్లను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. కాగా ఈ రాక్షస సందేశం ట్విట్టర్, ఐమెసేజెస్ ప్లాట్ ఫాంలపై విరివిగా సర్క్యులేట్ అవుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News