Telugu Students: రాజస్థాన్ లో తినడానికి సరైన తిండి కూడా లేక అలమటిస్తున్న తెలుగు విద్యార్థులు... వీడియో ఇదిగో!

  • మెడికల్ కోచింగ్ కోసం కోటా వెళ్లిన ఏపీ, తెలంగాణ విద్యార్థులు
  • లాక్ డౌన్ తో హాస్టళ్ల మూసివేత
  • బిస్కెట్లు తింటూ కడుపు నింపుకుంటున్నామని ఆవేదన
Telugu students stranded in Kota due to lock down

రాజస్థాన్ లోని కోటా పట్టణం మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్లకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ కోచింగ్ తీసుకునేందుకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలి వస్తుంటారు. అయితే  లాక్ డౌన్ విధించడంతో అనేక రాష్ట్రాల విద్యార్థులు కోటాలో చిక్కుకుపోయారు. యూపీ తమ విద్యార్థుల కోసం కోటాకు పెద్ద ఎత్తున బస్సులను పంపింది. ఈ నేపథ్యంలో, కోటాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు వందల మంది విద్యార్థులు దీనస్థితిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

లాక్ డౌన్ కారణంగా హాస్టళ్లు మూసివేయడంతో తినడానికి సరైన తిండి కూడా లేదని, బిస్కెట్లు తింటూ కడుపు నింపుకుంటున్నామని ఆవేదన వెలిబుచ్చారు. ఇతర రాష్ట్రాలు కొన్ని తమ విద్యార్థులను స్వరాష్ట్రాలకు తరలించాయని, తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా తమను తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలుగు విద్యార్థులు ఓ వీడియో విడుదల చేశారు. అందులో పలువురు విద్యార్థినులు దీనంగా వేడుకోవడం కలచివేస్తోంది.

More Telugu News