Kruthi Sanon: చెల్లెలిని పరిచయం చేసే పనిలో కృతి సనన్

Kruthi Sanon
  • తెలుగులో దక్కని సక్సెస్
  • బాలీవుడ్లో వరించిన విజయాలు
  • రంగంలోకి దిగుతున్న నుపుర్ సనన్  
వెండితెరపై కథానాయికలుగా రాణిస్తున్నవారిలో చాలామంది తమ చెల్లెళ్లను కూడా కథానాయికలుగా పరిచయం చేశారు. అయితే వాళ్లలో నిలదొక్కుకున్నవాళ్లు చాలా తక్కువ మంది. బాలీవుడ్ సుందరి కృతి సనన్ కూడా తన చెల్లెలు నుపుర్ సనన్ ను కథానాయికగా పరిచయం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోందట.

తెలుగులో సక్సెస్ అనే మాట వినలేకపోయిన కృతి సనన్, ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లి భారీ విజయాలనే తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇటీవల కాలంలో ఆమె కెరియర్ గ్రాఫ్ కాస్త మందగించింది. ఈ నేపథ్యంలో ఆమె తన చెల్లెలు నుపుర్ సనన్ ను రంగంలోకి దింపడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. 'నా చెల్లెలు నాకంటే టాలెంటెడ్ .. కెరియర్ పరంగా తాను చాలా దూరం వెళుతుంది' అంటూ తనకి తెలిసినవాళ్లకు పరిచయం చేస్తోందట. ఆమె ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయనేది చూడాలి మరి.
Kruthi Sanon
Nupur Sanon
Bollywood

More Telugu News