పొగాకు రైతులకు శుభవార్త: జీవీఎల్
- పొగాకు కొనుగోళ్లు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడి
- కేంద్రం నుంచి భరోసా వచ్చిందంటూ ట్వీట్
- రెడ్ జోన్ లో ఉన్న పొగాకు కొనుగోలు కేంద్రాలు
ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ఆలస్యం అవుతోందన్నది ఆ వార్త సారాంశం. కరోనా నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో పలు చోట్ల రెడ్, ఆరెంజ్ జోన్లు ఏర్పాటు చేసినందున పొగాకు వేలం ప్రక్రియ ముందుకు కదల్లేదని ఆ వార్తలో పేర్కొన్నారు. పొగాకు వేలం కేంద్రాలు ఉన్న ఒంగోలు, టంగుటూరు, కందుకూరు తదితర ప్రాంతాలు రెడ్ జోన్ లోకి వెళ్లాయని వివరించారు. వాస్తవానికి ఏప్రిల్ 20న వేలం నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావం పొగాకు కొనుగోళ్లపైనా పడింది.