Corona Virus: దేశంలో కోరలు చాస్తున్న కరోనా.. 25 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు!

Corona cases in India near to 25 thousands
  • దేశంలో 24,506కి చేరుకున్న పాజిటివ్ కేసులు
  • 24 గంటల్లో కొత్తగా 1,429 కేసులు
  • మొత్తం మరణాల సంఖ్య 775
ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేసులు పెరుగుతున్న వేగం తీరు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,429 కేసులు పెరిగాయి. 57 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 24,506కు చేరుకుంది. వీరిలో 5,063 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 775కి చేరుకుంది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు..
.
Corona Virus
Update
Deaths
India

More Telugu News