Hyper Aadi: రొమాంటిక్ పంచ్ లు ఇచ్చే హైపర్ ఆదికి వచ్చే ఏడాది పెళ్లి?

Hyper Aadi getting married
  • 'జబర్దస్త్'తో విపరీతమైన క్రేజ్
  • పంచ్ డైలాగ్స్ తో ఫేమస్ అయిన ఆది
  • సినిమాల్లోను వరుస అవకాశాలు  
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా హైపర్ ఆది బాగా పాప్యులర్ అయ్యాడు. పంచ్ లు పేల్చడంలో హైపర్ ఆది ఒక రేంజ్ లో దూసుకెళుతుంటాడు. ఆయన పంచ్ ల కోసమే చాలామంది ఆ షోను ఫాలో అవుతుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆది పంచ్ లలో ఎక్కువగా రొమాన్స్ టచ్ కనిపిస్తూ ఉంటుంది. స్టేజ్ పైకి ఆయన రొమాంటిక్ సాంగ్స్ తోనే ఎంట్రీ ఇస్తుంటాడు. అలాంటి హైపర్ ఆది .. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనున్నట్టు ఒక వార్త షికారు చేస్తోంది.

ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమేనని అంటున్నారు. అమ్మాయి వాళ్లది ప్రకాశం జిల్లాకి చెందిన కుటుంబం అని తెలుస్తోంది. ఒక వైపున కామెడీ షోతో దూసుకెళుతూనే, మరో వైపున నటుడిగాను, రచయితగాను వెండితెరపై తన ప్రతిభను చాటుకుంటున్న హైపర్ ఆది, ఒక ఇంటివాడు అవుతుండటం అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే.
Hyper Aadi
Jabardasth
Tollywood

More Telugu News