Gandhi Hospital: తమను అపార్టుమెంట్లలోకి అనుమతించడం లేదంటూ.. మహిళా డాక్టర్ల ఫిర్యాదు

  • గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా’ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న మహిళా డాక్టర్లు
  • డాక్టర్లను వారి నివాసంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్న ఇరుగుపొరుగు
  • డాక్టర్ల ఫిర్యాదుతో స్పందించిన మంత్రి ఈటల
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా’ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న మహిళా డాక్టర్లకు కొత్త ఇబ్బందులు వచ్చిపడ్డాయి. ‘కరోనా’ పేషెంట్లకు చికిత్స చేస్తున్నారన్న కారణంగా వైద్యులు నివాసం ఉండే అపార్టుమెంట్లలోకి వారిని అనుమతించడం లేదు. ఈ విషయమై వనస్థలిపురం పోలీసులకు మహిళా డాక్టర్లు ఫిర్యాదు చేశారు. కాగా, డాక్టర్ల ఇబ్బందులపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. డాక్టర్లను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
Gandhi Hospital
Lady Doctors
Corona Virus
Vanastalipuram
Police

More Telugu News