Etela Rajender: గాంధీ ఆసుపత్రిపై కొందరు సైకోలు దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి ఈటల ఫైర్

  • సామాజిక మాధ్యమాల వేదికగా దుష్ప్రచారం
  • ‘కరోనా’ పేషెంట్లకు కల్పించే సౌకర్యాలు సరిగా లేవనడం తగదు
  • వైద్యులను వేధించినా, దాడులకు పాల్పడ్డా ఉపేక్షించం
Minster Eetala Rajender Press meet

గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా’ బాధితులకు కల్పించే సౌకర్యాలు బాగుండడం లేదంటూ సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు సైకోలు దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు.

హైదరాబాద్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గాంధీలో చికిత్స పొందుతున్న ఏ ఒక్క పేషెంట్ తమకు కల్పిస్తున్న సౌకర్యాలు సరిగా లేవని చెప్పలేదని అన్నారు. పాత ఫొటోలతో సైకోలు, శాడిస్టులు ఇలాంటి దుష్ప్రచారం చేయొద్దని ఆయన హెచ్చరించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది మనోధైర్యం దెబ్బతినేలా చేయొద్దని సూచించారు. వైద్యులను వేధించినా, వారిపై దాడులకు పాల్పడ్డా ఉపేక్షించమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తెలంగాణలో ‘కరోనా’ పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని అన్నారు. ‘కరోనా’ తీవ్రంగా ఉన్న పేషెంట్లకు ఈ చికిత్స అందిస్తామని చెప్పారు.

More Telugu News