Uttarakhand: ఉత్తరాఖండ్ లో పసికందులపైనా క్వారంటైన్ కేసు నమోదు!

Uttarakhand implements strict measures against corona
  • కేసులు నమోదైన వారిలో 6 నెలల శిశువు, మూడేళ్ల చిన్నారులు
  • విచారణకు ఆదేశాలు జారీచేసిన ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్
  • క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పడితే కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, పాలుతాగే పసికందులపైనా లాక్ డౌన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, ఉత్తరకాశీ జిల్లాలో 51 మందిపై హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేయగా, వారిలో 6 నెలల శిశువు, మూడేళ్ల వయసున్న చిన్నారులు కూడా ఉన్నారు.

ఈ వ్యవహారంలో రాష్ట్ర అధికారులపై విమర్శలు వస్తున్నాయి. బాలనేరస్తుల చట్టం ప్రకారం 8 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలిచ్చామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జిల్లా కొవిడ్-19 అధికారిని తప్పించడంతో సహా ఇతర క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు.
Uttarakhand
Child
Corona Virus
Quarantine
Case

More Telugu News