Hyper Aadi: పోలీసులు, వైద్యులకు సహకరిద్దాం: హైపర్ ఆది

Lets cooperate to police and doctors says Hyper Adi
  • వాళ్లు మనకోసం చాలా కష్టపడుతున్నారు
  •  ఇంట్లోనే ఉండి మన కుటుంబాలను, దేశాన్ని కాపాడుకుందాం
  • ఆరోగ్య ఆంధ్ర ట్విట్టర్లో వీడియో సందేశం
కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు  ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని  హైపర్ ఆది విజ్ఞప్తి చేశాడు. ఈ మహమ్మారి నుంచి మనల్ని కాపాడేందుకు పోలీసులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు కష్టపడుతున్నారని అన్నాడు. వారందరికీ సహకరిద్దామని, ఇంట్లోనే ఉందామని చెప్పాడు.

కరోనాకి సంబంధించిన అధికారిక సమాచారం కోసం 8297104104 నంబర్ కు  వాట్సప్ చేయాలని సూచించాడు. ఈ మేరకు ఆది వీడియో సందేశాన్ని ఆరోగ్య ఆంధ్ర తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. ‘బయట కాలు పెట్టకుండా ఇంట్లోనే  ఉండడం ఇబ్బందిగా ఉన్న పర్లేదు. మనం బయట కాలు పెడితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంట్లోనే ఉండి మనల్ని మనం కాపాడుకుందాం. అలాగే, మన ఫ్యామిలీని, దేశాన్ని కాపాడుకుందాం’ అని సూచించాడు.
Hyper Aadi
urges
people
cooperate
police
doctors

More Telugu News