Chandrababu: వైసీపీ ఎంపీ చేసిన ఈ పనిని తెలుసుకుని షాక్ అయ్యాను: వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు

  • రక్త నమూనాలను పరీక్షించే ల్యాబ్‌లో పనులకు అడ్డంకులు
  • కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఈ ల్యాబ్‌కు అనుమతులున్నాయి
  • అయినప్పటికీ అడ్డుకున్నారు
Shocked to see the YSR Congress MP obstruct a diagnostic lab

వైసీపీ నేతల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. 'ఓ రక్త నమూనాలను పరీక్షించే ల్యాబ్‌లో పనులకు అడ్డంకులు కల్గిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒకరు చేసిన ఈ పని గురించి తెలుసుకుని షాక్ అయ్యాను. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ఈ ల్యాబ్‌కు ఐసీఎంఆర్‌ కూడా అనుమతులు ఇచ్చింది. కరోనా వైరస్‌పై పోరాడుతూ వైద్య సిబ్బంది తమ జీవితాలను పణంగా పెట్టి పనిచేస్తోన్న సమయంలో ఆ ఎంపీ ఇటువంటి చర్యలకు పాల్పడడం విస్మయానికి గురి చేస్తోంది' అని తెలిపారు.

కాగా,  కృష్ణాజిల్లా మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరికి చెందిన హైదరాబాదులోని భవనంలోని ల్యాబ్‌లో కరోనా పరీక్షలు చేయడానికి అనుమతులురాగా, ఆ తదుపరి రోజే ఈ పనులను అడ్డుకున్నారని జాతీయ చానెల్ టైమ్స్‌ నౌ తెలిపింది. ఈ వీడియోను చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు. మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి కరోనా పోరాటంలో ఆటంకాలు కలిగిస్తున్నారని జాతీయ చానెల్‌లో విమర్శలు చేశారు. కొవిడ్‌ వారియర్స్ ల్యాబ్‌ను ఆయన టార్గెట్ చేశారని పేర్కొన్నారు. ల్యాబ్‌కు ఆయన తాళం వేశారని, టెక్నీషియన్లు అంతా బయటే నిలబడాల్సి వచ్చిందని వారు తెలిపారు.

కాగా, హైదరాబాద్‌లోని కినేటా టవర్‌లో టెనెట్ మెడ్ కార్ప్ ప్రైవేటు లిమిటెడ్‌ ల్యాబ్‌ నిర్వహిస్తోంది. అయితే, పదేళ్ల లీజు గడువు ఉన్నప్పటికీ ల్యాబ్‌ను ఖాళీ చేయాలంటూ బాలశౌరీ దౌర్జన్యంగా దారిని మూసేస్తున్నారంటూ ఆ సంస్థ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

More Telugu News