Corona Virus: బయోసెన్సర్​తో కరోనా వైరస్‌ గుట్టురట్టు!

 Biosensor that detects corona virus
  • అభివృద్ధి చేసిన స్విట్జర్లాండ్‌ పరిశోధకులు
  • సెన్సర్ తో తక్కువ సమయంలోనే వైరస్ గుర్తింపు
  • సులభంగా, కచ్చితత్వంతో ఫలితాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మానవాళి మనుగడకే ముప్పుగా మారుతోంది. ఈ వైరస్ నిర్ధారణ పరీక్షల నిర్వహణే చాలా దేశాలకు సవాల్‌గా మారింది. దీన్ని సులభతరం చేసేందుకు స్విట్జర్లాండ్‌లోని పరిశోధకులు కీలక ఆవిష్కరణ చేశారు. మనిషిలో వైరస్ ఆనవాళ్లను కనిపెట్టేందుకు బయోసెన్సర్ పరికరాన్ని రూపొందించారు.

 ప్రస్తుతం ‘రివర్స్ ట్రాన్స్‌స్ర్కిప్షన్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్’ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా బాధితుడిలో చాలా తక్కువ స్థాయిలో ఉన్న వైరస్‌ను కూడా గుర్తించొచ్చు. కానీ, ఫలితాలు వచ్చేందుకు ఆలస్యం అవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా  స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రొఫెసర్ జింగ్ వాంగ్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం  బయోసెన్సర్ ను అభివృద్ధి చేసింది.

ఈ సెన్సర్ తో సురక్షితంగా, కచ్చితత్వంతో, మరింత వేగంగా వైరస్‌ ను కనిపెట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. బయోసెన్సర్ ద్వారా కృత్రిమ డీఎన్‌ఏ గ్రాహకాలు ఏర్పరుస్తూ అనుమానితుల నమూనాల్లో  వైరస్ ఆర్ఎన్‌ఏ క్రమాలను గుర్తించడం ద్వారా వారికి కరోనా సోకిందో లేదో వెంటనే గుర్తించొచ్చని అంటున్నారు.

  • Loading...

More Telugu News