Tamilnadu: లాక్ డౌన్ లో రోడ్ల మీదకు వచ్చిన యువకులకు 'కరోనా ఎఫెక్ట్' చూపించిన తమిళనాడు పోలీసులు!

Tamilnadu Police Unique Punishment to Youth
  • నిబంధనలను పాటించని ఆకతాయిలు
  • కరోనా రోగి ఉన్న అంబులెన్స్ లోకి ఎక్కించి బుద్ధి
  • పోలీసుల వినూత్న ప్లాన్
  • ఆకతాయిలను భయపెట్టేందుకేనని వివరణ
కరోనా కట్టడికి లాక్ డౌన్ ను పాటిస్తూ, ప్రజలంతా ఇళ్లలోనే ఉండటం మినహా మరో మార్గం లేదని, ప్రజలంతా నిబంధనలను పాటించాలని ఎంతగా చెబుతున్నా కొందరు వినడం లేదు. పలు ప్రాంతాల్లో ప్రజలు ఏ విధమైన పనీ లేకున్నా బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే, పోలీసులు, తమ లాఠీలకు పని చెబుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆకతాయిలను భయభ్రాంతులకు గురిచేశారు.

బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులను ఆపి, ఎందుకు బయటకు వచ్చారని ప్రశ్నించిన పోలీసులు, వారు కావాలనే తిరుగుతున్నారని గుర్తించి, వెంటనే కరోనా రోగులున్న అంబులెన్స్ లోకి ఎక్కించారు. దీంతో ఆ యువకులు బెంబేలెత్తిపోయారు. ఇకపై తాము ఇలా రాబోమని వేడుకున్నారు.

వారికి బుద్ధి వచ్చిందని భావించిన తరువాత పోలీసులు అసలు నిజం చెప్పారు. వాహనంలోని వారంతా పోలీసులేనని, ఆకతాయిలను భయపెట్టేందుకే ఈ వీడియోను తయారు చేశామని తెలిపారు. తమిళనాడు పోలీసులు పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఆలోచన బాగుందని, వారికి సరిగ్గా బుద్ధి చెప్పారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Tamilnadu
Police

More Telugu News