Siddipet District: సిద్ధిపేటలో రౌడీషీటర్ దారుణ హత్య.. పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో ప్రధాన నిందితుడు!

  • చిన్నకోడూర్ మండలం రామంచ శివారులో ఎల్లంగౌడ్ హత్య
  • కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు
  • నిందితులు పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో రౌడీషీటర్ ఎల్లంగౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. చిన్నకోడూర్ మండలం రామంచ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎల్లంగౌడ్ ను అత్యంత కిరాతకంగా హతమార్చారు. సమాచారం అందిన వెంటనే సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, హత్యకు పాల్పడిన నిందితులు పోలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఎల్లంగౌడ్ పై పలు కేసులు ఉన్నాయి. శామీర్ పేట వద్ద పోలీసులపై కాల్పులు, కానిస్టేబుల్ హత్యకు సంబంధించిన కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News