Vicky Koushal: నా మీద వస్తున్న వార్తలను నమ్మకండి: 'యూరీ' హీరో విక్కీ కౌశల్

Vicky Koushal Requests Donot Spread Fake News on Him
  • లాక్ డౌన్ ను ఉల్లంఘించినట్టు వార్తలు
  • పోలీసులు కొట్టారని కూడా ప్రచారం
  • అవాస్తవమేనని స్పష్టం చేసిన విక్కీ
తాను ఎటువంటి లాక్ డౌన్ నిబంధనలనూ మీరలేదని, తననేమీ పోలీసులు అదుపులోకి తీసుకోలేదని 'యూరీ' హీరో విక్కీ కౌశల్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టారు.

లాక్ డౌన్ సమయంలో నిబంధనలను అతిక్రమించి తిరుగుతూ విక్కీ, పోలీసులకు పట్టుబడ్డాడని, పోలీసులు అతన్ని కొట్టారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ, ట్వీట్ పెట్టిన విక్కీ, "నేను లాక్ డౌన్ ను ఉల్లంఘించి, పోలీసు దెబ్బలు రుచి చూశానని వచ్చిన వార్తలు నిరాధారం. లాక్ డౌన్ తొలి రోజు నుంచి నేను నా ఇంటి గడప దాటి బయట కాలు పెట్టలేదు. ఈ తరహా అబద్ధపు వార్తలను ప్రచారం చేయకండి" అని స్పష్టం చేశాడు. 
Vicky Koushal
Lockdown
Fake News
Police
Twitter

More Telugu News